News June 15, 2024
రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్: కేసీఆర్
TG: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. కరెంట్ విషయంలో గణనీయమైన మార్పు చూపించాం. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Similar News
News September 19, 2024
రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమం
AP: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు.
News September 19, 2024
హాఫ్ సెంచరీతో మెరిసిన జడేజా
భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి బ్యాటు ఝళిపించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ 50 (73బంతుల్లో) చేశారు. 144 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మరో సీనియర్ ఆల్‌రౌండర్ అశ్విన్‌తో (73*) కలిసి ఆదుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 272/6గా ఉంది.
News September 19, 2024
నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇవ్వాలి: జెత్వానీ
AP: తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి సినీ నటి జెత్వానీ ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి అనితతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురైన పరిస్థితులు మరెవ్వరికీ రాకూడదన్నారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని పరిహారం కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జెత్వానీ వ్యవహారంలో ముగ్గురు IPSలపై ప్రభుత్వం వేటు వేసింది.