News May 25, 2024

ఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు: VV లక్ష్మీనారాయణ

image

మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని <<13312459>>గడువు <<>>ముగియనుండగా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం 10ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా.. ఏపీకి రాజధాని లేదు. ఈక్రమంలో భారత రాష్ట్రపతి HYDను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పరిశీలిస్తారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 3, 2026

BJPని చూసి RSSను అర్థం చేసుకోవద్దు: మోహన్ భాగవత్

image

‘‘RSS యూనిఫాం, వ్యాయామాలను చూసి పారా మిలిటరీ అనుకోవద్దు. అలాగే BJPని చూసి సంఘ్‌ను అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు’’ అని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజాన్ని ఏకం చేసి, విదేశీ శక్తుల చేతుల్లో భారత్ మళ్లీ చిక్కకుండా చూడటమే సంఘ్ లక్ష్యమని భోపాల్‌ (MP)లో మాట్లాడుతూ చెప్పారు. వికీపీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, అసలు విషయం తెలుసుకోవడానికి నేరుగా ‘శాఖ’కు వచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

News January 3, 2026

శరీరంలో ఒత్తిడి ఎక్కువైతే కనిపించే లక్షణాలివే..

image

శరీరంలో ఒత్తిడి పెరిగినపుడు కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీంతో బీపీ, షుగర్, జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మన శరీరం తెలిపే లక్షణాలను గమనించాలంటున్నారు నిపుణులు. కార్టిసాల్ ఎక్కువైతే నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. ఎప్పుడూ నీరసం, అలసట, చిరాకు, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ లక్షణాలు ఉంటాయి. అలాగే ఆలోచ‌నా శ‌క్తితో పాటు మెద‌డు ప‌నితీరు కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.

News January 3, 2026

కార్టిసాల్ హార్మోన్‌ పెరిగితే..

image

కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గి శ‌రీరం త‌ర‌చూ అనారోగ్యాల బారిన ప‌డుతుంది. హైబీపీ, గుండె జ‌బ్బులు వస్తాయి. జీవ‌న విధానంలో, ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, తాజా ఆకుకూరలు, జీడిపప్పు, బెర్రీలు, నారింజ, జామ, గుడ్లు, చేప, చికెన్‌ వంటివి చేర్చుకోవాలి.