News May 25, 2024

ఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు: VV లక్ష్మీనారాయణ

image

మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని <<13312459>>గడువు <<>>ముగియనుండగా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం 10ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా.. ఏపీకి రాజధాని లేదు. ఈక్రమంలో భారత రాష్ట్రపతి HYDను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పరిశీలిస్తారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 19, 2025

MLC ఎన్నికలు.. పదేపదే కాల్స్‌తో తలనొప్పి!

image

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి-గుంటూరు, కృష్ణా, తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కొత్త కొత్త నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మద్దతు అడుగుతున్నారని.. రోజుకు 10 కాల్స్ వస్తే 7-8 కాల్స్ వాళ్లవే అని అసహనానికి గురవుతున్నారు. మరి మీకూ కాల్స్ వస్తున్నాయా?

News February 19, 2025

మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

image

TG: మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్యయాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్‌కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.

News February 18, 2025

సివిల్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించింది. ఈ నెల 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఫిబ్రవరి 11తోనే ముగియగా ఇవాళ్టి వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్లలో పొరపాట్ల సవరణకు ఫిబ్రవరి 22-28 వరకు అవకాశం ఇచ్చింది. కాగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనుంది.

error: Content is protected !!