News August 13, 2024

HYDలో కంపెనీ విస్తరిస్తాం: కాగ్నిజెంట్ సీఈవో

image

TG: అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ MNC కంపెనీ ‘కాగ్నిజెంట్’ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీమ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆ కంపెనీ సీఈవో రవికుమార్ ట్విటర్‌లో స్పందించారు. ‘న్యూ యార్క్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యా. బెస్ట్ ఐటీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో కంపెనీని అధునాతన మౌలిక సదుపాయాలతో విస్తరిస్తాం. దీనిద్వారా 15వేల ఉద్యోగాలు కల్పిస్తాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 30, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

image

TG: మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసి సీఎం రేవంత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారంటూ అందులో పేర్కొంది. ​ఇది నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

News October 30, 2025

పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు: పవన్

image

AP: మొంథా తుఫాను ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా చూడాలని Dy.CM పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు, రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. పంట, ఆస్తినష్టం వివరాలను ప్రజల నుంచి వాట్సాప్‌లో సేకరిస్తోంది.

News October 30, 2025

రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

image

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.