News August 13, 2024
HYDలో కంపెనీ విస్తరిస్తాం: కాగ్నిజెంట్ సీఈవో
TG: అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ MNC కంపెనీ ‘కాగ్నిజెంట్’ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీమ్ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆ కంపెనీ సీఈవో రవికుమార్ ట్విటర్‌లో స్పందించారు. ‘న్యూ యార్క్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యా. బెస్ట్ ఐటీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో కంపెనీని అధునాతన మౌలిక సదుపాయాలతో విస్తరిస్తాం. దీనిద్వారా 15వేల ఉద్యోగాలు కల్పిస్తాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 8, 2024
చంపేస్తామంటూ బజరంగ్ పునియాకు బెదిరింపులు
కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియాను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. ఓ ఫారిన్ నంబర్ నుంచి వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వినేశ్ ఫొగట్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా ఆ పార్టీ నియమించింది.
News September 8, 2024
మరో 5 జిల్లాల్లో రేపు సెలవు
APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.
News September 8, 2024
ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.