News February 19, 2025

నిద్ర చెడగొడుతోందని కోడిపై RDOకు ఫిర్యాదు..

image

పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తోందని కేరళ, పల్లిక్కల్ వాసి రాధాకృష్ణ కురూప్ ఓ కోడిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా నిద్రను చెడగొడుతూ ప్రశాంతమైన తన జీవితానికి భంగం కలిగిస్తోందని ఆయన స్థానిక RDOకు మొరపెట్టుకున్నారు. దానిని సీరియస్‌గా తీసుకున్న అధికారి వెంటనే ఇంటికొచ్చి పరిశీలించారు. పక్కింటి మేడపై కోళ్ల షెడ్డును గమనించి దానిని 14 రోజుల్లో మరోచోటకు మార్చాలని ఆదేశించారు.

Similar News

News March 19, 2025

436 మంది మృతి

image

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు హమాస్ అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. 2 రోజుల్లో 436 మంది పాలస్తీనీయులు మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఇందులో 183 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని హమాస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు 61,700 మంది చనిపోయారు.

News March 19, 2025

పెళ్లి చేసుకోనున్న స్టార్ హాకీ ప్లేయర్లు

image

భారత జాతీయ హాకీ జట్టు ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదితా దుహాన్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మైదానంలో తమ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ జంట ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతు ప్రారంభమైనట్లు తెలిపాయి. కరోనా సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది.

News March 19, 2025

KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

AP: రాష్ట్రంలోని KGBVల్లో 2025-26 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతి, ఫస్ట్ ఇంటర్ ఎంట్రెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు తెలిపారు. 7, 8, 9, 10, సెకండ్ ఇంటర్‌లో మిగిలిపోయిన సీట్లకు కూడా దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. https://apkgbv.apcfss.in/ సైట్‌లో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. 70751 59996 నంబరును సంప్రదించవచ్చు.

error: Content is protected !!