News October 26, 2024

ALTT ఓటీటీపై ఫిర్యాదులు

image

ALTT ఓటీటీపై చ‌ర్య‌లు తీసుకోవాలని ముంబై పోలీసులకు స‌మాచార మాజీ క‌మిష‌న‌ర్ ఉద‌య్ మ‌హుర్క‌ర్ ఆధ్వ‌ర్యంలోని సేవ్ క‌ల్చ‌ర్‌-సేవ్ భార‌త్ ఫౌండేష‌న్‌ ఫిర్యాదు చేసింది. సదరు OTT అస‌భ్య‌క‌ర కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చ‌ట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక‌-అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఉద‌య్ పేర్కొన్నారు.

Similar News

News October 26, 2024

వ్యర్థాలను తొలగించని బిల్డర్లపై చర్యలు: హైడ్రా

image

TG: హైడ్రా కూల్చిన తర్వాత భవన వ్యర్థాలను తొలగించే బాధ్యత సంబంధిత బిల్డర్లదేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చం. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది చెరువులు, నాలాల్లో చేపట్టిన నిర్మాణాలనే కూల్చుతాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.

News October 26, 2024

మెట్రో విస్తరణకు క్యాబినెట్ ఆమోదం

image

TG: హైదరాబాద్‌లో మెట్రో రైల్ మార్గం విస్తరణకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, LB నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించేందుకు ఆమోదం తెలిపింది.

News October 26, 2024

జగన్ పతనాన్ని కోరుకుంటున్న షర్మిల: గుడివాడ అమర్నాథ్

image

AP: PCC చీఫ్ షర్మిల దిగజారి ప్రవర్తిస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మేం నిజాలను బయటపెడుతుంటే షర్మిల ఉలిక్కిపడుతున్నారు. సొంత అన్న గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సైకో, శాడిస్ట్ అంటూ జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. ఆయనపై ఇలానే మాట్లాడితే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఊరుకోరు’ అని ఆయన హెచ్చరించారు.