News July 27, 2024
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్.. పోర్టల్ డౌన్ అంటూ ఫిర్యాదులు
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేస్తుంటే చుక్కలు కనబడుతున్నాయని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్ డౌన్ అవుతోందని కంప్లైంట్స్ చేస్తున్నారు. లాగిన్ అవ్వట్లేదని మరికొందరు వాపోతున్నారు. దేశంలో రిటర్న్స్ ఫైల్ చేసేది 2-3% మంది మాత్రమేనని అయినా ఈ సాంకేతిక సమస్యలేంటని పెదవి విరుస్తున్నారు. కాగా జులై 31లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే రూ.5వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
Similar News
News October 16, 2024
J&K మంత్రివర్గంలో చేరట్లేదు: కాంగ్రెస్
జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.
News October 16, 2024
ఓ వైపు వర్షం.. గ్రౌండ్‌లోనే కోహ్లీ
తొలి టెస్టులో సత్తాచాటేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వర్షం పడుతుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తానన్నట్లు ఆయన ఎదురుచూస్తున్న ఫొటో వైరలవుతోంది. వర్షంలోనూ తన కిట్‌తో గ్రౌండ్‌లో తిరుగుతూ కనిపించారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉండగా వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు.
News October 16, 2024
మగ బిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య
కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకాస్వామి భార్య సహన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హీరోయిన్ పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపారని రేణుకాస్వామిని దర్శన్ అనుచరులు చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు దక్షిణాదిలో సంచలనం సృష్టించాయి. కాగా రేణుకా స్వామి మరణించిన సమయంలో సహన 5 నెలల గర్భిణి.