News November 16, 2024
కులగణన సకాలంలో పూర్తి చేయండి: రేవంత్

TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.
Similar News
News January 3, 2026
1,146పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

SBI 1146 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి అప్లై గడువును పొడిగించింది. తొలుత 996 పోస్టులను ప్రకటించగా.. మరో 150 పోస్టులను కలిపి గడువును JAN 10 వరకు పెంచింది. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. VP వెల్త్, AVP వెల్త్, CRE పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 3, 2026
మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుదాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.
News January 3, 2026
ఈ ఏడాది 5 వరల్డ్ కప్‌లు

2026లో వివిధ క్రీడల్లో కలిపి మొత్తం 5 వరల్డ్ కప్‌లు జరగనున్నాయి. ఇందులో మెన్స్ U19 ODI WC (JAN 15- FEB 6), మెన్స్ T20 WC (FEB 7-MAR 8), ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (JUN 11-JUL 19), ఉమెన్స్ T20 WC (JUN 12-JUL 5), మెన్స్&ఉమెన్స్ హాకీ WC (AUG 15-30) ఉన్నాయి. వీటితో పాటు కామన్వెల్త్ గేమ్స్(JUL 23-AUG 2), ఏషియన్ గేమ్స్(SEP 19-OCT 4), AUS ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్ జరగనున్నాయి.


