News November 16, 2024
కులగణన సకాలంలో పూర్తి చేయండి: రేవంత్
TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.
Similar News
News December 14, 2024
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
విద్యుత్ వ్యవస్థ ధ్వంసమే లక్ష్యంగా రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై రష్యా భీకర దాడికి దిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 93 క్రూయిజ్, క్షిపణులు, 200కు పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసిందన్నారు. అందులో 11 క్రూయిజ్, 81 క్షిపణులను నేల కూల్చినట్లు ఆయన ప్రకటించారు. తమ దేశంపై రష్యా దురాక్రమణ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత విద్యుత్తు వ్యవస్థపై ఇదే అతిపెద్ద దాడి అని ఆయన వివరించారు.
News December 14, 2024
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు
AP: రాష్ట్ర వ్యాప్తంగా 40 అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు, లైసెన్సులు లేకుండా విక్రయాలు, తూకాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి. కొన్నిచోట్ల వ్యాపారులు రికార్డులు సరిగా నిర్వహించలేదని తేల్చాయి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఇలాగే కొనసాగుతాయని విజిలెన్స్ DG ప్రకటించారు.
News December 14, 2024
ఉద్దేశం మంచిదైతే ‘జమిలి’ మేలే: ప్రశాంత్ కిషోర్
సదుద్దేశంతో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే దేశానికి మంచిదే అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఉగ్ర చర్యల కట్టడికి తెచ్చే చట్టాన్ని ఒక వర్గానికే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉన్నప్పుడు, ఇది కూడా అలా కాకూడదన్నారు. 1960 వరకు జరిగిన జమిలి ఎన్నికల్ని దుర్వినియోగం చేసే ఉద్దేశాలు లేకుండా ప్రవేశపెడితే మంచిదే అని పేర్కొన్నారు. దీన్ని క్రమపద్ధతిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.