News August 18, 2024
ఇంటర్ సిలబస్ కుదింపు.. బోర్డు పరీక్ష ఎత్తివేత?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723936846337-normal-WIFI.webp)
AP: ఇంటర్ సిలబస్, పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. MPCలో గణితం(2 పేపర్లు), BiPCలో వృక్ష, జంతు శాస్త్రం సిలబస్‌లను కుదించాలని యోచిస్తోంది. NCERTకి అనుగుణంగా వాటిని ఒక్కో పేపర్‌గా మార్చాలని భావిస్తోంది. అలాగే CBSEలో 11వ తరగతికి బోర్డు పరీక్ష లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని APలో తీసుకొస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందనే విషయాన్ని పరిశీలిస్తోంది.
Similar News
News February 11, 2025
ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738636853991_1226-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్‌లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
News February 11, 2025
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌కు 3.7B ఏళ్లు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739228109997_893-normal-WIFI.webp)
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్‌ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.
News February 11, 2025
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు: కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739207715055_695-normal-WIFI.webp)
AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.