News February 11, 2025
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు: కమిషనర్

AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.
Similar News
News March 13, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 13, 2026
శుభ సమయం (13-3-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ దశమి తె.5.51 వరకు
➤ నక్షత్రం: పూర్వాషాఢ రా.1.06 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.11-8.32, మ.1.18-సా.4.04, సా.5.04-సా.6.03
➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
➤ యమగండం: మ.3.00-సా.4.30
➤ దుర్ముహూర్తం: ఉ.8.33-ఉ.9.12, మ.12.30-మ.1.18
➤ వర్జ్యం: ఉ.9.22-ఉ.11.07
➤ అమృత ఘడియలు: రా.7.51-రా.9.36
News March 13, 2026
పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్‌తో మోదీ చర్చలు

పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్‌తో చర్చించినట్లు PM మోదీ ట్వీట్ చేశారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల ధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల భద్రత, అడ్డంకులు లేని ఇంధన సరఫరా తమకు అత్యంత ప్రాధాన్యత అంశాలని మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి కట్టుబడి ఉంటుందని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పెజెష్కియాన్‌ను కోరారు.


