News October 29, 2024

కర్ణాటకలో పానీపూరీ ప్రియుల్లో ఆందోళన!

image

మంచూరియాన్‌లో ఆర్టిఫిషియ‌ల్ క‌ల‌ర్ల వాడ‌కంపై ఇప్ప‌టికే నిషేధం విధించిన క‌ర్ణాట‌క తాజాగా పానీపూరీల‌పై దృష్టిసారించింది. వీటి వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యానికి పొంచివున్న ముప్పుపై అధ్య‌య‌నం చేస్తోంది. బెంగ‌ళూరులో 200 సెంట‌ర్ల నుంచి శాంపిల్స్ సేక‌రించిన అధికారులు వాటిని ప‌రీక్ష‌ల‌కు పంపారు. వీటి తయారీలో అనేక విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం వీటిని బ్యాన్ చేస్తుందేమో అని పానీపూరీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News January 29, 2026

ఈ సంకేతాలు ఉంటే కిడ్నీ సమస్యలు!

image

* ఎక్కువ/తక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం.
* ముఖం, పాదాల్లో వాపులు.
* నురుగు/గోధుమ రంగు/రక్తంతో మూత్రం రావడం.
* త్వరగా అలసిపోయినట్టు/అలసటగా అనిపించడం.
* కండరాల తిమ్మిర్లు.
* చర్మం పొడిబారడం, దురద పెట్టడం.
* ఊపిరి సరిగ్గా అందకపోవడం.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 29, 2026

50 పరుగుల తేడాతో భారత్ ఓటమి

image

విశాఖలో జరిగిన 4వ T20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దూబె(65) చెలరేగి ఆడటంతో గెలుపు దిశగా పయనించింది. అతను ఔటవ్వగానే కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి 50 పరుగుల తేడాతో ఓడింది. శాంట్నర్ 3, సోధీ, డఫీ చెరో 2 వికెట్లు తీశారు.

News January 28, 2026

T-మున్సి‘పోల్స్’.. రంగంలోకి BJP అగ్రనేతలు!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, హోం మంత్రి అమిత్ షాను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. FEB 2,3న మహబూబ్‌నగర్‌లో నితిన్ నబీన్, 8,9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్‌షా సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది. అగ్ర నేతల పర్యటనపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.