News October 29, 2024
కర్ణాటకలో పానీపూరీ ప్రియుల్లో ఆందోళన!
మంచూరియాన్‌లో ఆర్టిఫిషియల్ కలర్ల వాడకంపై ఇప్పటికే నిషేధం విధించిన కర్ణాటక తాజాగా పానీపూరీలపై దృష్టిసారించింది. వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి పొంచివున్న ముప్పుపై అధ్యయనం చేస్తోంది. బెంగళూరులో 200 సెంటర్ల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపారు. వీటి తయారీలో అనేక విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం వీటిని బ్యాన్ చేస్తుందేమో అని పానీపూరీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 12, 2024
ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దయ్యేది అక్రమంగా ఉంటున్న వారికే..
USలో ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దవుతుందనే వార్తలు భారతీయులను కలవరపెడుతున్నాయి. రూల్స్ ప్రకారం దంపతులకు గ్రీన్ కార్డు, H1B, స్టూడెంట్ వీసా లేకపోయినా అక్కడ పిల్లలు జన్మిస్తే ఆ శిశువుకు నేరుగా ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. అనంతరం తల్లిదండ్రులకు కూడా సిటిజన్‌షిప్ లభిస్తుంది. ఈ నిబంధనను ట్రంప్ మారుస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమంగా ఉంటున్న వారి గురించి మాత్రమే ట్రంప్ ప్రచారంలో ప్రస్తావించారు.
News November 12, 2024
లగచర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఉద్యోగ సంఘాల జేఏసీ DGPకి ఫిర్యాదు చేసింది. అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరిపించాలని జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు DGPకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు 55 మందిని అరెస్ట్ చేయగా, ఉద్రిక్తతల నేపథ్యంలో దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.
News November 12, 2024
ట్రంప్ రాకతో USలో వాటికి పెరిగిన డిమాండ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో అగ్రరాజ్యంలో అబార్షన్ పిల్స్‌కి డిమాండ్ పెరిగింది. ట్రంప్ గెలిచిన 24 గంటల్లోనే పిల్స్ కోసం 10K అభ్యర్థనలు వచ్చినట్టు ఎయిడ్ యాక్సెస్ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇది రోజువారి డిమాండ్‌లో 17 రెట్లు అధికమని పేర్కొంది. గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తానని ట్రంప్ ప్రకటించడంతో అక్కడి ప్రజలు అబార్షన్ పిల్స్ కోసం తెగ ఆర్డర్ చేస్తున్నారు.