News February 3, 2025

కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు

image

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News February 19, 2025

పాకిస్థాన్‌లో రెపరెపలాడిన భారత జెండా

image

ఎట్టకేలకు పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్‌ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.

News February 19, 2025

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

image

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం YS జగన్‌కు, YCP MLAలకు లేదని విమర్శించారు. ‘నేరస్థులను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని ట్వీట్ చేశారు.

News February 19, 2025

100% మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పోరాడగలదని, పార్టీ నేతలు ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని చెప్పారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!