News May 21, 2024

మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఉత్తమ్

image

TG: సీఎం పదవి కోసం తాను ఢిల్లీకి రూ.100కోట్లు పంపించానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తాను దైవ దర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లానని, త్వరలోనే మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని స్పష్టం చేశారు.

Similar News

News March 16, 2026

వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

image

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)

News March 16, 2026

INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

image

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.

News March 16, 2026

FLASH: తగ్గిన బంగారం ధర

image

బంగారం ధర క్రమంగా దిగొస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,45,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.