News November 28, 2024

బంగ్లాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరం: ప్రియాంక

image

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై MP ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్కాన్ గురు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, హిందూ మైనార్టీలపై దాడులు తీవ్ర ఆందోళనకరమని ఆమె అన్నారు. ఈ విషయాలపై బంగ్లా ప్రభుత్వం ఎదుట కేంద్ర సర్కారు తన స్వరం గట్టిగా వినిపించాలని కోరారు. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో చిన్మయ్‌ను అరెస్ట్ చేయగా, ఆయన్ను విడుదల చేయాలని అక్కడి హిందువులు నిరసనలు చేపట్టారు.

Similar News

News December 12, 2024

మగాడికి కాస్త ఊరట: ‘మనోవర్తి’కి సుప్రీంకోర్టు సూచనలు (1)

image

బెంగళూరు టెకీ, భార్యా బాధితుడు అతుల్ సుభాష్ సూసైడ్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. విడాకుల కేసుల్లో మనోవర్తిని నిర్ణయించేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులూ అనుసరించాల్సిన సూచనలివే..
* భార్యాభర్తల ఆర్థిక, సామాజిక హోదా పరిశీలన
* భవిష్యత్తులో భార్య, పిల్లల అవసరాల పరిశీలన
* భార్యాభర్తలిద్దరి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు పరిశీలన
==> <<14855954>>NEXT PART<<>>

News December 12, 2024

మగాడికి కాస్త ఊరట: ‘మనోవర్తి’కి సుప్రీంకోర్టు సూచనలు (2)

image

* దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు * అత్తారింట్లో భార్య జీవన ప్రమాణాలేంటి? * కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె ఉద్యోగం మానేసిందా? * మనోవర్తి చెల్లిస్తున్నప్పుడు భర్త ఆర్థిక హోదా, ఆదాయం, ఇతర బాధ్యతలు ఏంటి? * ఇదేమీ సింపుల్ ఫార్ములా కానప్పటికీ మనోవర్తి నిర్ణయంలో తోడ్పడతాయని సుప్రీంకోర్టు తెలిపింది. మనోవర్తి చెల్లించాల్సిన మొత్తం ఏ భర్తకూ శిక్ష కారాదని, అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలని పేర్కొంది.

News December 12, 2024

నిఖేశ్ అక్రమార్జన రోజుకు రూ.2 లక్షలు!

image

TG: నీటిపారుదలశాఖ AEE నిఖేశ్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అక్రమార్జన రోజుకు ₹.2లక్షలకు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్‌లో చేరిన 10ఏళ్లలోనే ₹.100కోట్లు కూడబెట్టారని సమాచారం. ఒక్కో ఫైల్‌కే ఆయన ₹.50లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. FTL, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.