News July 5, 2024

RTC బస్సులో మహిళకు పురుడు పోసిన కండక్టర్

image

TGSRTC సిబ్బంది మరోసారి మానవత్వం చాటుకున్నారు. HYDకు చెందిన శ్వేతారత్నం అనే మహిళ ఆరాంఘర్‌లో 1Z నంబర్ బస్సెక్కారు. బహదూర్‌పుర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. గమనించిన కండక్టర్ సరోజ మహిళా ప్రయాణికుల సాయంతో బస్సులోనే ప్రసవం చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. కండక్టర్ సమయస్ఫూర్తిని అంతా ప్రశంసిస్తున్నారు.

Similar News

News October 14, 2024

హర్మన్ ప్రీత్ కౌర్‌పై నెటిజన్ల ఫైర్

image

మహిళల టీ20 WCలో ఆస్ట్రేలియాపై ఓడి భారత్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఫైర్ అవుతున్నారు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె బ్యాటింగ్ చూస్తుంటే టెస్టు క్రికెట్‌ను తలపించిందని ఎద్దేవా చేస్తున్నారు. మ్యాచ్ చివర్లో సింగిల్స్ తీయడం వల్లే మ్యాచ్ ఓటమి పాలైందని కామెంట్లు చేస్తున్నారు.

News October 14, 2024

గుజరాత్‌లో రూ.5వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

image

గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు ఇటీవల దేశ రాజధానిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 700కిలోలకు పైగా కొకెయిన్ పట్టుకున్నారు. విచారణలో గుజరాత్‌లోని అంకలేశ్వర్ సిటీలో ఉన్న ఆవ్‌కార్ డ్రగ్స్ సంస్థ పేరును నిందితులు చెప్పినట్లు సమాచారం. గుజరాత్ పోలీసులతో కలిసి సంయుక్తంగా సంస్థపై దాడులు చేశామని, రూ.5వేల కోట్ల విలువైన 518 కిలోల కొకెయిన్‌ను పట్టుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

News October 14, 2024

పూరీ ఆలయంలో భక్తులకు ఉచిత ప్రసాదం?

image

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఇకపై భక్తులకు ఉచిత ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏటా రూ.14 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉచిత ప్రసాదం కోసం కొందరు దాతలు విరాళాలు ఇస్తున్నారని, మరికొందరు కూడా ముందుకు రావాలని సర్కార్ కోరుతున్నట్లు తెలుస్తోంది.