News October 14, 2024
గుజరాత్‌లో రూ.5వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు ఇటీవల దేశ రాజధానిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 700కిలోలకు పైగా కొకెయిన్ పట్టుకున్నారు. విచారణలో గుజరాత్‌లోని అంకలేశ్వర్ సిటీలో ఉన్న ఆవ్‌కార్ డ్రగ్స్ సంస్థ పేరును నిందితులు చెప్పినట్లు సమాచారం. గుజరాత్ పోలీసులతో కలిసి సంయుక్తంగా సంస్థపై దాడులు చేశామని, రూ.5వేల కోట్ల విలువైన 518 కిలోల కొకెయిన్‌ను పట్టుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Similar News
News November 3, 2024
ఢిల్లీలో మరింత పడిపోయిన వాయు నాణ్యత
దేశరాజధాని ఢిల్లీని కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకు అక్కడ వాయు నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ WHO సూచించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఉ.5గంటలకు AQI 507 పాయింట్లతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
News November 3, 2024
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం
ఇండిగో, ఎయిరిండియా విమానాలకు మరో సారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నై-హైదరాబాద్ ఎయిరిండియా, హైదరాబాద్-పుణే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు గోవా-కోల్‌కతా విమానానికి ఇదే తరహా బెదిరింపులు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
News November 3, 2024
‘కాంతార-2’ కోసం రంగంలోకి RRR యాక్షన్ కొరియోగ్రాఫర్
కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘RRR’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బల్గేరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పని చేయనున్నారు. ‘కాంతార’కు మించి సినిమాటిక్ క్వాలిటీని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే టోడర్‌ను తీసుకున్నారు రిషబ్. RRRలో యాక్షన్స్ సీక్వెన్స్‌తో ఆకట్టుకున్న టోడర్ కాంతారను ఎలా చూపిస్తారో చూడాలి మరి.