News May 4, 2024
ప్లే ఆఫ్స్‌కు వెళ్తామని నమ్మకముంది: ఆర్సీబీ కోచ్

తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందన్న నమ్మకం ఇంకా ఉందని ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గుజరాత్‌తో హోం గ్రౌండ్‌లో మ్యాచ్ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మా ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికి వరసగా రెండు మ్యాచులు గెలిచాం. ఈరోజు కూడా గెలుస్తాం. మా ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నారు. మాకు ఇంకా నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2026
INDvsENG మ్యాచ్.. ప్రపంచ రికార్డు

T20WC సెమీస్‌లో IND-ENG మధ్య థ్రిల్లర్ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ICC ఛైర్మన్ జై షా వెల్లడించారు. జియో హాట్‌స్టార్‌లో ఏకకాలంలో 65.2 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏ లైవ్ ఈవెంట్‌కైనా ఇదే అత్యధికమని పేర్కొన్నారు. స్పోర్ట్స్, మీడియా, స్ట్రీమింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
News March 6, 2026
చనిపోయారన్న ఓటర్లను ఈసీ ముందు నిలబెడతా: మమత

SIRకు వ్యతిరేకంగా బెంగాల్ CM మమత కోల్‌కతాలో ధర్నా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TMCని ఓడించాలనే కుట్రతోనే BJP, EC కలిసి సర్ ప్రక్రియ చేపట్టాయని మండిపడ్డారు. ఇదొక సైలెంట్ రిగ్గింగ్ అని దుయ్యబట్టారు. బతికి ఉన్న ఓటర్లనూ చనిపోయినట్లుగా ప్రకటించారని ఆరోపించారు. వారందరినీ ఈ వేదిక సాక్షిగా ఈసీ ముందు నిలబెడతానని పేర్కొన్నారు. లక్షల మంది అర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఫైరయ్యారు.
News March 6, 2026
100 గంటలు.. ₹34 వేల కోట్ల ఖర్చు

ఇరాన్-అమెరికా&ఇజ్రాయెల్ వార్ మొదలై వారం అవుతోంది. తొలి 100 గంటల్లో USA $3.4 బిలియన్లు (₹34 వేల కోట్లు) ఖర్చు చేసిందని యుద్ధ నిపుణులు అంచనా వేశారు. భారీ ఎయిర్‌క్రాఫ్ట్స్, మిస్సైల్స్ ప్రయోగిస్తూ రోజుకు సగటున $891Mn ఖర్చు చేస్తోందన్నారు. అటు తమ $3.7Bn రిజర్వు కరిగిపోవడంతో, అదనంగా $50Bn కావాలని రక్షణ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందట. అయితే విపరీతమైన ఖర్చుపై US కాంగ్రెస్ అభ్యంతరం తెలపొచ్చని సమాచారం.


