News May 4, 2024
ప్లే ఆఫ్స్‌కు వెళ్తామని నమ్మకముంది: ఆర్సీబీ కోచ్
తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందన్న నమ్మకం ఇంకా ఉందని ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గుజరాత్‌తో హోం గ్రౌండ్‌లో మ్యాచ్ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మా ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికి వరసగా రెండు మ్యాచులు గెలిచాం. ఈరోజు కూడా గెలుస్తాం. మా ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నారు. మాకు ఇంకా నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2024
కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఇదొక కారణమంటున్నారు!
విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉండటానికి బ్లాక్ వాటర్ కూడా ఓ కారణమని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఐరోపాలోని ఎవియన్ లెస్ బైన్స్ సరస్సు నుంచి సేకరించిన నీటిని కోహ్లీ & అనుష్క సేవిస్తుంటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గించి & చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ను కూడా తగ్గిస్తుంది. లీటరుకు రూ.4వేలు చెల్లించి కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
News November 5, 2024
2024 US elections: పోలింగ్ ప్రారంభం
అమెరికా 47వ అధ్యక్ష ఎన్నికకు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్, బ్లూ స్టేట్స్‌లో పెద్దగా హడావుడి లేకపోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెలకొంది. డెమోక్రాట్ల నుంచి కమల, ఆమె రన్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బరిలో ఉన్నారు.
News November 5, 2024
రేపట్నుంచి ఒంటిపూట బడులు
TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.