News March 30, 2024

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

image

AP: విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట లైన్లలో వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 60,958 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Similar News

News October 5, 2024

దేశంలో సంపన్న రాష్ట్రాలు.. AP, TG స్థానాలివే

image

FY2024-25లో GSDP, GDP అంచనాల ప్రకారం ₹42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర దేశంలోనే రిచెస్ట్ స్టేట్‌గా నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు(₹31.55L cr), కర్ణాటక(₹28.09L cr), గుజరాత్(₹27.9L cr), UP(₹24.99L cr), బెంగాల్(₹18.8L cr), రాజస్థాన్(₹17.8L cr), TG(₹16.5L cr), AP(₹15.89L cr), MP(₹15.22L cr) ఉన్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా, బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా MH టాప్‌లో ఉంది.

News October 5, 2024

బాధ్యతలు చేపట్టిన కార్పొరేషన్ ఛైర్మన్లు

image

AP: రాష్ట్రంలో వివిధ సంస్థల ఛైర్మన్లు ఇవాళ అమరావతిలో తమ బాధ్యతలు చేపట్టారు. మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌-దామచర్ల సత్య, పర్యాటక శాఖ ఛైర్మన్-నూకసాని బాలాజీ, ఏపీఐఐసీ ఛైర్మన్-మంతెన రామరాజు బాధ్యతలు తీసుకున్నారు. వీరికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.

News October 5, 2024

నటి నాలుగో పెళ్లి వార్తలు.. అవన్నీ సినిమా స్టంట్స్

image

తమిళ నటి వనిత విజయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను <<14242143>>వివాహం<<>> చేసుకుంటాననే అర్థంలో కొన్ని రోజుల కిందట ఫొటో షేర్ చేసింది. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.