News November 7, 2024

ట్రంప్‌నకు అభినందనలు.. హసీనాను పీఎంగా పేర్కొన్న అవామీ లీగ్

image

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు తెలుపుతూ షేక్ హసీనా పేరుతో అవామీ లీగ్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇందులో హసీనాను బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రస్తావించడమే దీనికి కారణం. రిజర్వేషన్లపై నిరసనలతో హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగా మహమ్మద్ యూనస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Similar News

News December 11, 2024

సియారామ్ బాబా.. ఇక లేరు

image

సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సియారామ్ బాబా ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన కడసారి చూపు కోసం మధ్యప్రదేశ్‌లోని భట్యాన్‌లో ఉన్న ఆశ్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రామచరిత మానస్ పఠిస్తూ చిన్న లంగోటీతో మాత్రమే జీవించిన బాబా.. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయిని సమాజానికి ఇచ్చేశారు. నర్మదా నది ఘాట్లను ఆయన ఇచ్చిన రూ.2.57 కోట్లతోనే అధికారులు అభివృద్ధి చేశారు.

News December 11, 2024

ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

image

AP: ప్రజలకు అవసరమైన పాలసీలు మాత్రమే తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. అందుకే ఐఏఎస్, ఐపీఎస్‌లు బాధ్యతగా పనిచేయాలి. మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2024

బాధ్యతలు స్వీకరించిన RBI కొత్త గవర్నర్

image

IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్‌టైమ్ జనరల్‌’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.