News March 18, 2024
బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి: మోదీ

తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం BJPకి ఓటు వేయాలి. మరోసారి మా విజయం ఖాయం. NDAకు 400కు పైగా సీట్లు ఇవ్వాలి. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 2, 2026
రైల్వేలో 22,195 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు గడువును మార్చి 3 నుంచి మార్చి 9వ తేదీకి పొడిగించారు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు మార్చి 11తో ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: <
News March 2, 2026
ఖమేనీకి ఎంత మంది పిల్లలో తెలుసా?

ఇజ్రాయెల్-US దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఒక భార్య, ఆరుగురు పిల్లలున్నారు. ఆయన భార్య పేరు మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్. వీరికి 1964లో వివాహమైంది. నలుగురు కుమారులు (మోస్తఫా, మొజ్తాబా, మసౌద్, మేసమ్), ఇద్దరు కూతుళ్లు (బోష్రా, హోదా), ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఓ కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా మరణించినట్లు వార్తలొచ్చాయి.
News March 2, 2026
సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్

గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మాట్లాడారు. ఆ దేశాల్లో భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. సౌదీ, బహ్రెయిన్‌పై దాడిని ఖండించారు.


