News March 18, 2024
బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి: మోదీ
తెలంగాణలో BJP ప్రభంజనంలో కాంగ్రెస్, BRS కొట్టుకుపోతాయని PM మోదీ అన్నారు. ‘రాష్ట్రంలో BJPకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. పదేళ్లలో రాష్ట్రానికి రూ.వేల కోట్లు కేటాయించాం. వికసిత్ భారత్ కోసం BJPకి ఓటు వేయాలి. మరోసారి మా విజయం ఖాయం. NDAకు 400కు పైగా సీట్లు ఇవ్వాలి. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 12, 2024
జమిలి ఎన్నికలు అంటే ఏమిటి?
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌లో భాగంగా జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా జమిలి ఎన్నికల్లో భాగంగా దేశంలో MP, MLA ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహిస్తారు. జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. 1999లో జస్టిస్ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ జమిలి ఎన్నికలు జరపాలని సూచించింది. కానీ అప్పుడు వీలుపడలేదు. ప్రస్తుతం జమిలి ఎన్నికలు బెల్జియం, స్వీడన్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో జరుగుతున్నాయి.
News December 12, 2024
పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను గోవాలో పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇవాళ సాయంత్రం మరోసారి వీరి పెళ్లి జరుగుతుంది.
News December 12, 2024
ఇందిరా ఎమర్జెన్సీని తలపించేలా అరెస్టులు: KTR
TG: తాండూరులోని గిరిజన హాస్టల్లో అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను అరెస్ట్ చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు. పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అడ్డుకోవడం కాకుండా విద్యార్థులకు పోషకాహారం అందించడంపై దృష్టి పెట్టాలని కోరారు.