News November 21, 2024
అదానీతో కాంగ్రెస్, BJP అనుబంధం దేశానికి అవమానం: KTR
TG: అదానీపై USలో కేసు నమోదైన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. అదానీతో కాంగ్రెస్, BJP అనుబంధం దేశానికే అవమానం అని అభిప్రాయపడ్డారు. ఆయన అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడని, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడంటూ దుయ్యబట్టారు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, మూసీలో అదానీ వాటా ఎంత అని ప్రశ్నించారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు.
Similar News
News December 5, 2024
KL-జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు: రోహిత్ శర్మ
రేపటి నుంచి జరిగే అడిలైడ్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని రోహిత్ శర్మ వెల్లడించారు. తొలి టెస్టులో జైస్వాల్‌తో కలిసి KL నెలకొల్పిన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. విదేశాల్లో బ్యాటింగ్ చేసిన విధానం వల్ల అతను ఓపెనింగ్‌కు అర్హుడని చెప్పారు. తాను మధ్యలో ఎక్కడో చోట బ్యాటింగ్ చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు కష్టమైనా జట్టుకు మంచి చేస్తుందన్నారు.
News December 5, 2024
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణ
AP: రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విదేశాలకు తరలిస్తున్నారనే అంశాలపై సీఐడీ విచారణ చేయనుంది.
News December 5, 2024
దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.లక్ష ఖరీదు చేసే వీటిని 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 10 చొప్పున అన్ని సెగ్మెంట్లకు కలిపి 1750 వాహనాలు ఇవ్వనుంది. నాలుగు నెలల్లో టెండర్లు నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందించనుంది. డిగ్రీ ఆపైన చదివిన వారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి తొలి దశలో వీటిని ఇస్తారు.