News May 20, 2024

కాంగ్రెస్ వాళ్లు మళ్లీ చీకటి రోజులు తెచ్చారు: KTR

image

BRS అధికారం కోల్పోగానే తమ ఇంట్లో కరెంట్ పోయిందని, రేవంత్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పాం కదా శివ గారు. మీకు ‘కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా తేల్చుకోండి’ అని. మార్పు మార్పు అన్నారు. 2014 కంటే ముందటి చీకటి రోజులను ఈ కాంగ్రెస్ వాళ్లు మళ్లీ తెచ్చారు ’ అని రిప్లై ఇచ్చారు.

Similar News

News December 9, 2024

సిరియాపై భారత ప్రభుత్వ కీలక ప్రకటన

image

సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.

News December 9, 2024

బీజేపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య

image

మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.

News December 9, 2024

గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టులో పిటిషన్

image

TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.