News March 17, 2024

మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: DK అరుణ

image

రాష్ట్రంలో ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తే అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, MBNR లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. విజయ సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లలో చేయనివి బీజేపీ పదేళ్లలోనే చేసి చూపెట్టిందని, ప్రధాని మోదీ భారత్ కీర్తిని పెంచుతుంటే కాంగ్రెస్ మాత్రం విషం చిమ్ముతోందని, ప్రతి ఒక్కరి నోటి వెంట మోదీ మాటే వినిపిస్తోందని అన్నారు.

Similar News

News April 24, 2025

వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్‌లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.

News April 24, 2025

MBNR: ‘భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి’

image

జిల్లాలో భూగర్భ జిల్లాలో అడుగంటకుండా వాటిని పెంచేందుకు వర్షపు నీటి సంరక్ష నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో నీటి నియంత్రణపై ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

News April 24, 2025

మిడ్జిల్: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మిడ్జిల్ మండల్ మల్లాపూర్‌లో నేడు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వడ్ల తేమ శాతం చూశారు. రైతులతో మాట్లాడుతూ.. సన్నాళ్లకు బోనస్ అందుతున్నాయా అని, తేమ శాతం వచ్చే విధంగా ఆరబెట్టాలని, రైతులకు కల్లాలకు స్థల పరిశీలన, సరిపడా టార్పాలిన్ ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో, ఏపీఎంకి సూచించారు.

error: Content is protected !!