News April 29, 2024

కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వాపస్.. పక్కా ప్లాన్‌తోనే?

image

ఇండోర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బమ్ తన నామినేషన్ వెనక్కి తీసుకోవడం వెనుక పక్కా ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో BJP నేత, ఇండోర్-1 MLA కైలాష్ విజయవర్గీయ కీలక పాత్ర పోషించారని సమాచారం. స్విచ్ఛాఫ్ చేసుకుని అక్షయ్ కాంగ్రెస్ శ్రేణులకు దూరంగా ఉండటంతో బీజేపీలో ఆయన చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్‌పై గత 17ఏళ్లుగా హత్యాయత్నం కేసు విచారణ జరుగుతుండటం గమనార్హం.

Similar News

News November 5, 2024

45 పైసలకే రూ.10 లక్షల బీమా

image

ప్రయాణికుల భద్రతకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో IRCTC కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు చేసింది. రైలు ప్రయాణం చేసేవారికి బీమా ప్రీమియం 45 పైసలుగా నిర్ణయించింది. ఇ-టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది తప్పనిసరి చేసింది. అయితే టికెట్లు బుక్ చేసుకున్నా 5 ఏళ్ల లోపు వారిని ఈ పాలసీలోకి చేర్చలేదు. టికెట్ బుక్ చేసుకున్నాక బీమా కంపెనీ సైట్‌లో నామినీ వివరాలు సమర్పించాలి.

News November 5, 2024

IPL మెగా వేలం ఎక్కడంటే?

image

ఐపీఎల్ మెగావేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆయా జట్లు రిటెన్షన్ జాబితాను సమర్పించాయి. ఈ మెగా వేలం కోసం 1,574 ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 320 మంది క్యాప్‌డ్, 1,224 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు.

News November 5, 2024

సెల్యూట్ తల్లి.. భర్త మరణంతో కుటుంబానికి అండగా!

image

కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మికంగా మరణించడంతో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ పర్సన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తామామ, పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఆమె రేయింబవళ్లు శ్రమిస్తోంది. సుప్రీతి ఎందరికో స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.