News April 11, 2024

రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

TG: మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌పై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మోదీ ఫొటోలతో ఉన్న శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచారని ఆరోపించారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరారు.

Similar News

News March 18, 2025

మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

image

సెల్‌ఫోన్‌ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్‌లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT

News March 18, 2025

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదు: KTR

image

TG: డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. ‘దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది మా పార్టీనే. డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై పోరాడుతాం. ఈనెల 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరై, మా పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తా’ అని తెలిపారు.

News March 18, 2025

ఉగ్రవాదులపై దాడులు.. నెక్స్ట్ టార్గెట్ అతడేనా?

image

PAKలో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హతమవడంతో ఆ సంస్థకు పెద్ద దెబ్బే తగిలింది. అయితే తర్వాతి దాడి LET వ్యవస్థాపకుడు, 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌పైనే జరిగే ఛాన్సుందని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 2023 రాజౌరి, 2024 రియాసి దాడుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఖతల్‌ను శనివారం గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడులు LET ఆపరేషన్స్‌ను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.

error: Content is protected !!