News May 10, 2024
రామమందిరానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది: అమిత్ షా

కాంగ్రెస్ పార్టీ 70ఏళ్ల పాటు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అయితే.. మోదీ 5ఏళ్లలోనే ఆలయాన్ని నిర్మించారని అన్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే రామ మందిర ప్రారంభోత్సవానికి రాలేదని ఆరోపించారు.
Similar News
News July 6, 2025
ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.
News July 6, 2025
మస్క్ కొత్త పార్టీతో ట్రంప్‌నకు నష్టమేనా?

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ స్థాపించడం రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశముంది. ముఖ్యంగా ట్రంప్‌నకు తలనొప్పి తీసుకురావొచ్చు. మస్క్ అపర కుబేరుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక్క ట్వీటుతో లక్షల మందిని ప్రభావితం చేయగల ఇన్‌ఫ్లుఎన్సర్. పైగా ‘మేక్ అమెరికా.. అమెరికా అగైన్’, ప్రజలకు స్వేచ్ఛనిప్పిస్తా అంటున్నారు. అయితే USలో 3 పార్టీల విధానం వర్కౌట్ అవ్వదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
News July 6, 2025
ప్రభాస్‌తో రణ్‌వీర్ బాక్సాఫీస్ క్లాష్?

ప్రభాస్‌తో బాక్సాఫీస్ క్లాష్‌కి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ రెడీ అవుతున్నట్లు బీ టౌన్‌లో వార్తలొస్తున్నాయి. ఇవాళ రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ‘దురంధర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్‌తో పోటీకి దిగుతారా? అనేది వేచిచూడాలి.