News December 19, 2024

‘BJP దౌర్జన్యం’పై ఎదురు కేసు పెట్టిన కాంగ్రెస్

image

BJPపై కాంగ్రెస్ కేసు నమోదు చేసింది. ‘బీజేపీ దౌర్జన్యం’ పేరుతో పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘సభలో అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారు. దానిపై మేమీరోజు నిరసన చేపట్టాం. ఇండియా కూటమి ఎంపీలంతా మకరద్వారం వద్దకు వెళ్లాం. అప్పటికే అక్కడున్న బీజేపీ సభ్యులు మమ్మల్ని తోసేసి ఖర్గే, రాహుల్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే బీజేపీ దాదాగిరీపై ఫిర్యాదు చేశాం’ అని కాంగ్రెస్ తెలిపింది.

Similar News

News February 5, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.

News February 5, 2025

పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!

image

కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్‌తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.

News February 5, 2025

హీరోయిన్ నోరా ఫతేహీ మృతి అంటూ వదంతులు.. క్లారిటీ

image

బంగీ జంప్ ప్రమాదంలో హీరోయిన్ నోరా ఫతేహీ మృతి చెందారంటూ వదంతులు వస్తున్నాయి. బంగీ జంప్ చేస్తుండగా రోప్ తెగి పైనుంచి కిందపడి మరణించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వీడియోలో ఉన్నది నోరా కాదని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. గతంలో బంగీ జంప్ చేస్తూ చనిపోయిన మహిళకు బదులు నోరా ఫొటోను ఉపయోగించి ఫేక్ వీడియో సృష్టించారని పేర్కొంది.

error: Content is protected !!