News December 19, 2024

‘BJP దౌర్జన్యం’పై ఎదురు కేసు పెట్టిన కాంగ్రెస్

image

BJPపై కాంగ్రెస్ కేసు నమోదు చేసింది. ‘బీజేపీ దౌర్జన్యం’ పేరుతో పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ‘సభలో అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారు. దానిపై మేమీరోజు నిరసన చేపట్టాం. ఇండియా కూటమి ఎంపీలంతా మకరద్వారం వద్దకు వెళ్లాం. అప్పటికే అక్కడున్న బీజేపీ సభ్యులు మమ్మల్ని తోసేసి ఖర్గే, రాహుల్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే బీజేపీ దాదాగిరీపై ఫిర్యాదు చేశాం’ అని కాంగ్రెస్ తెలిపింది.

Similar News

News January 18, 2025

బీదర్, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పురోగతి

image

బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.

News January 18, 2025

దొంగతనం చేయలేదు: కరీనా కపూర్

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News January 18, 2025

డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.