News August 27, 2024

BRSపై కాంగ్రెస్ ఫైర్

image

TG: కవితకు బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందంటూ BRS సంబరాలు చేసుకుంటోంది. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘న్యాయం గెలిచిందా? మద్యం పాలసీ స్కాంలో జైలుకు వెళ్లినందుకా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపినందుకా? తెలంగాణ సమాజం తలదించుకునేలా చేసినందుకా? ఉద్యమం పేరుతో దోచుకుని, అవినీతి కేసులో దొరికినందుకా? ఢిల్లీలో బీజేపీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది.

Similar News

News September 17, 2024

కోల్‌కతాకు కొత్త కమిషనర్ నియామకం

image

కోల్‌కతాకు నూతన పోలీస్ కమిషనర్‌గా మనోజ్ వర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో కమిషనర్‌ను మార్చాలని వైద్యులు డిమాండ్ చేశారు. దీంతో వినీత్ గోయల్ స్థానంలో మమత సర్కార్ ఆయనను నియమించింది.

News September 17, 2024

పూసింది.. పూసింది ‘నీలకురింజి’

image

ఊటీలోని ఎప్పనాడు, బిక్కనాడు కొండ ప్రాంతాల్లో 12 ఏళ్లకు ఓసారి పూసే నీలకురింజి పూలు వికసించాయి. ఈ సుందర దృశ్యాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. వీటి శాస్త్రీయ నామం ‘స్ట్రోబిలాంతెస్ కుంతియానా’. కొండ ప్రాంతాల్లో 1300-2400 మీటర్ల ఎత్తులో ఈ పూల మొక్కలు పెరుగుతుంటాయి. మొక్క 30- 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఊదా నీలం రంగులో ఉండే ఈ పూల కారణంగానే నీలగిరి పర్వత శ్రేణులకు ఆ పేరు వచ్చింది.

News September 17, 2024

లడ్డూ గెలుచుకున్న ముస్లిం జంట.. KTR అభినందనలు!

image

కులమతాలకు అతీతంగా సాగే వినాయక చవితి ఉత్సవాల్లో ఓ ముస్లిం కుటుంబం వేలంలో లడ్డూ గెలుచుకుంది. సదరు కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘వినాయక చవితి అంటేనే గంగా జమునా తహజీబ్. ఆసిఫాబాద్‌లోని భట్‌పల్లిలో గణేష్ లడ్డూ గెలుచుకున్న ఆసిఫ్ భాయ్‌కి కంగ్రాట్స్. శాంతియుత, సామరస్యపూర్వక తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రార్థించండి. అసలైన తెలంగాణ సంస్కృతి ఇదే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.