News December 15, 2024
GHMC ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్!

TG: వచ్చే ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్, టీపీసీసీ చీఫ్ మహేశ్, GHMC పరిధిలోని పార్టీ నేతలు హాజరుకానున్నారు. విజయమే లక్ష్యంగా ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
Similar News
News November 20, 2025
అరుదైన వైల్డ్లైఫ్ ఫొటో.. మీరూ చూసేయండి!

ఒక వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ అత్యంత అరుదైన క్షణాన్ని బంధించారు. సెంట్రల్ అమెరికాలోని ‘కోస్టారికా’లో కనిపించే అత్యంత విషపూరితమైన పాము మీద దోమ వాలి.. ప్రశాంతంగా రక్తాన్ని పీల్చింది. ఇది గమనించిన ఫొటోగ్రాఫర్(twins_wild_lens) క్లిక్ మనిపించగా తెగ వైరలవుతోంది. ఈ రకం పాములు చెత్తలో కలిసిపోయి ఎంతో మంది ప్రాణాలు తీశాయని తెలిపారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నిక్ వోల్కర్ కూడా ఈ ఫొటోను ప్రశంసించారు.
News November 20, 2025
గింజ కోసం మొక్కజొన్న సాగు.. కోత సమయం ఇలా గుర్తించాలి

గింజ కోసం సాగు చేసే మొక్కజొన్న కోత సమయాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుంచి కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగం పరీక్షిస్తే (కొన్ని రకాలలో) నల్లని చారలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంట కోస్తే మంచి దిగుబడి వస్తుంది.
News November 20, 2025
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.


