News December 15, 2024

GHMC ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్!

image

TG: వచ్చే ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు గాంధీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్, టీపీసీసీ చీఫ్ మహేశ్, GHMC పరిధిలోని పార్టీ నేతలు హాజరుకానున్నారు. విజయమే లక్ష్యంగా ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

Similar News

News November 9, 2025

రెండో అనధికారిక టెస్ట్.. ఇండియా-A ఓటమి

image

సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా-A ఓడింది. భారత్ నిర్దేశించిన 417 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బవుమా సహా మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అటు భారత జట్టులో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదారు. అంతకుముందు తొలి అనధికారిక టెస్టులో IND గెలిచింది. కాగా ఈనెల 14 నుంచి IND, SA మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

News November 9, 2025

జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.

News November 9, 2025

ష్.. ఊపిరి పీల్చుకో..!

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార పర్వం ముగిసింది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతల గొంతులు సైలెంట్ అయ్యాయి. ఎన్నికల 48గం. ముందు సైలెన్స్ పీరియడ్ రూల్‌తో జూబ్లీహిల్స్ ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. విమర్శలు, సవాళ్లు, సెంటిమెంట్లు, డెవలప్మెంట్లు సహా ఎన్నో విన్న ప్రజాస్వామ్య దేవుళ్లు ఈ నెల 11న తమ తలరాత రాసుకోనున్నారు. అటు బిహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.