News July 7, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంది: హరీశ్ రావు

image

TG: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, స్కూళ్లలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. టీచర్ల కొరత, వేతనాల ఆలస్యం, అరకొర వసతులు వంటి సమస్యలు రాష్ట్ర విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2024

నాలుగు రోజుల వ్యవధిలో 2 సార్లు కంపించిన భూమి

image

TG: రాష్ట్రంలో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 4న ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాలలో ఈ స్థాయిలో కంపించడం ఇదే తొలిసారి. తాజాగా మహబూబ్‌నగర్‌లో భూమి కంపించడం ప్రజల్లో భయాన్ని తీవ్రం చేస్తోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెబుతున్నారు.

News December 7, 2024

నితీశ్ కుమార్‌లో మొద‌లైన టెన్షన్

image

మ‌హారాష్ట్ర ప‌రిణామాలు బిహార్ CM నితీశ్‌ను టెన్ష‌న్ పెడుతున్నాయి. శిండే నాయ‌క‌త్వంలోనే మ‌హాయుతి ఎన్నిక‌ల్ని ఎదుర్కొన్నా మెజారిటీ సీట్లు గెలిచిన BJP CM ప‌ద‌విని అంటిపెట్ట‌ుకుంది. ఇదే కోవ‌లో ప్ర‌స్తుతం బిహార్‌లో JDU కంటే BJP MLAల బ‌లం అధికం. ఈ ప్రాతిప‌దిక‌న 2025లో బీజేపీ గ‌నుక అత్య‌ధిక సీట్లు తీసుకొని, ఎన్నిక‌ల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలిస్తే త‌న ప‌రిస్థితి ఏంట‌ని నితీశ్‌ టెన్షన్ పడుతున్నారు.

News December 7, 2024

కేసీఆర్‌తో ఎలాంటి చర్చ జరగలేదు: మంత్రి పొన్నం

image

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించే క్రమంలో ఆయనతో ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రతిపక్ష నేత కావడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. గులాబీ బాస్ కోరిక మేరకు లంచ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గవర్నర్‌ను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.