News May 21, 2024

సొంత పార్టీ నేతల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: బొమ్మై

image

సొంత పార్టీ నేతల కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇదే జరుగుతుందని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక జాతీయస్థాయిలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. కాంగ్రెస్ నిలువునా చీలవచ్చని.. ఆ ప్రభావం కర్ణాటకపైనా ఉంటుందన్నారు.

Similar News

News April 16, 2026

రామాయణ ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుంది: యశ్

image

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్‌ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్‌స్టెల్లార్ వంటి బ్లాక్‌బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

News April 16, 2026

ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు పెంపు: షా

image

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా LSలో విమర్శించారు. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు. దక్షిణాదిలో జనాభా రేషియో కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఏపీలో సీట్లు 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయి. కర్ణాటక, తమిళనాడులోనూ అంతే. ఇది నా గ్యారంటీ. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు.

News April 16, 2026

పంత్ ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్

image

RCBతో జరిగిన మ్యాచులో LSG కెప్టెన్ పంత్‌ ఎడమ మోచేతికి బంతి తగిలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘LSG చాలా దారుణమైన జట్టు. వాళ్ల బౌలింగ్ మాత్రమే కాస్త బాగుంది. 5 మ్యాచులు పూర్తయినా బ్యాటింగ్‌లో రాణించేలా కనిపించట్లేదు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.