News April 4, 2024
నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది: KTR

TG: నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తూ CM రేవంత్‌కు KTR బహిరంగ లేఖ రాశారు. ‘నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. వారి బతుకులు ఆగమయ్యేలా ప్రభుత్వ విధానాలున్నాయి. నేతన్నలకు ఆర్డర్లు నిలిపివేశారు. చేనేతమిత్ర వంటి పథకాలను పక్కనపెట్టారు. గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి, పెండింగ్ బిల్లులను చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News April 22, 2025
విపత్తులతో ఏ ఒక్కరూ చనిపోకూడదు: అనిత

AP: ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణాలు పోవడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ‘గత ప్రభుత్వం వంతెనలు, డ్రైనేజీలు, సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి సంభవించకుండా జాగ్రత్త పడతాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
News April 22, 2025
BRS మాజీ MLA చెన్నమనేనిపై CID కేసు

TG: వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనేదానిపై ఈ కేసు నమోదైంది. జర్మనీ పౌరసత్వాన్ని దాచి ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐడీ FIR నమోదు చేసింది.
News April 22, 2025
RESULTS: ఫస్ట్ ర్యాంక్ ఈమెకే

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.