News January 24, 2025
కాంగ్రెస్ చాలా సార్లు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది: కిషన్ రెడ్డి

రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డురంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగా పాలించలేదు. చాలా సార్లు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది. అంబేడ్కర్ జీవించి ఉన్నంతకాలం ఆయనను అవమానించింది. ఆ పార్టీ కుటుంబం కేంద్రంగా పని చేస్తుంది. కుట్రలు చేసి జనతా పార్టీని కూల్చేసింది. నెహ్రూ ఫ్యామిలీ మాత్రమే దేశాన్ని పాలించాలని భావిస్తుంటుంది’ అని విమర్శించారు.
Similar News
News February 8, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.
News February 8, 2025
చంద్రబాబు ప్రచారం చేసిన చోట్ల BJPకి ఆధిక్యం

AP సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
News February 8, 2025
ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.