News December 31, 2024

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది: ఎమ్మెల్సీ కవిత

image

TG: కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. CM రేవంత్ దుష్టపాలన సాగిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ‘కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రతి 3 గంటలకోసారి మహిళలపై లైంగిక దాడి జరుగుతోంది. హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతల్ని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి. కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 23, 2025

భరతమాత ఓ హిందూ దేవత మాత్రమే: కర్ణాటక వర్సిటీ సిలబస్‌పై ఫైర్

image

కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేశ సామరస్యాన్ని దెబ్బతీసే పాఠాలను KA యూనివర్సిటీ పుస్తకాల్లోంచి తొలగించాలని సామాజికవేత్తలు గవర్నర్‌ థావర్‌చంద్‌కు లేఖరాశారు. భరతమాత కేవలం హిందువుల దేవతని, అన్యమతాలకు సంబంధం లేదని పుస్తకాల్లో ఉన్నట్టు తెలిపారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకుండా ఉండాల్సిందని, RSS సమాజాన్ని విడదీస్తుందంటూ ముద్రించారని పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు.

News January 23, 2025

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

AP: అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతడు క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చరణ్‌ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన చరణ్ ఇంతలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

News January 23, 2025

BIG NEWS.. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం <<15232469>>ఒప్పందం <<>>కుదుర్చుకుంది.