News June 4, 2024

ముస్లిం ప్రాంతాల్లో కాంగ్రెస్, ట్రైబల్ ఏరియాల్లో బీజేపీ డామినేషన్

image

సామాజిక వర్గాల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఏకపక్షంగా సాగలేదు. ముస్లిం ప్రజల ఆధిపత్య సెగ్మెంట్లలో ఇండియా 56, ఎన్డీయే 43 చోట్ల ఆధిక్యం ప్రదర్శించాయి. ఆదివాసీ డామినేట్ ప్రాంతాల్లో ఈ సంఖ్య 15, 35గా ఉంది. దళిత ఆధిపత్యం ఉండే చోట్ల 7, 15 సాధించాయి. జనరల్ ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో NDA 228, IND 175తో ఉన్నాయి. ఎస్సీ రిజర్వుడులో 41, 39, ఎస్టీ రిజర్వుడులో 23, 20గా ఈ గణాంకాలు ఉన్నాయి.

Similar News

News November 29, 2024

SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.

News November 29, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’

image

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.

News November 29, 2024

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో DEC 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో 30వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.