News April 9, 2024
రేవంత్‌కు కాంగ్రెస్ నుంచే ప్రమాదం: కిషన్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News April 19, 2026
ఆ ఊళ్లో హనుమంతుడి పేరెత్తరు..

ఉత్తరాఖండ్ ద్రోణగిరిలో హనుమంతుడిని పూజించరు. రామాయణ కాలంలో లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని కోసం వచ్చిన హనుమంతుడు ఇక్కడి పర్వతాన్ని తీసుకెళ్లారని గ్రామస్థుల నమ్మకం. గ్రామదేవత అనుమతి లేకుండా కొండను తీసుకెళ్లడంతో తమ ఆరాధ్య దైవానికి అవమానం జరిగిందని వారు భావిస్తారు. అందుకే ఈ ఊరిలో హనుమంతుడి గుళ్లు, జెండాలు కనిపించవు. అయితే వారికి హనుమపై ద్వేషం లేదు. కానీ అనుమతి అడగకపోవడం సరైనది కాదని నమ్ముతారు.
News April 19, 2026
RTC ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుందా?

TG: ఈ నెల 22 నుంచి RTC ఉద్యోగులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో జీతాల పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021, 2025 వేతన సవరణలు పెండింగ్‌లో ఉండగా, ఒక విడత వేతన సవరణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 7 లేదా 8% ఫిట్‌మెంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్మిక నేతలతో చర్చించి ఫిట్‌మెంట్‌ను 10% మించకుండా ఖరారు చేసే ఛాన్సుందని, మరో వేతన సవరణపైనా హామీ ఉండొచ్చని సమాచారం.
News April 19, 2026
RRR నిర్మాణం.. ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr పరిహారం!

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ కొనసాగుతోంది. సంగారెడ్డి(D) సదాశివపేట(M) పెద్దాపూర్ పరిధిలోని భూములకు ఎకరానికి గరిష్ఠంగా ₹1.27Cr, కనిష్ఠంగా దౌల్తాబాద్ శివారు భూములకు ఎకరానికి ₹16L ఇస్తున్నట్లు సమాచారం. RRR కోసం సంగారెడ్డి CALA పరిధిలో 526 ఎకరాలు అవసరమని NHAI నిర్ణయించింది. ఇప్పటివరకు నిర్వాసితులకు ₹119.50Cr చెల్లించారు.


