News September 18, 2024

BRS విజయాలతో కాంగ్రెస్‌ గొప్పలు: హరీశ్ రావు

image

TG: బీఆర్ఎస్ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇలా గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ‘BRS హయాంలోనే MSMEల అభివృద్ధి జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇవి మూతపడ్డా, ఇక్కడ మాత్రం సగర్వంగా ఎదిగింది. ఎంఎస్ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 10, 2024

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. APలోని మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 10, 2024

ఈ విషయంలో ప్రపంచ దేశాల కంటే భారత్ ఉత్తమం

image

భారత ఆహార వినియోగ విధానాలు ఉత్త‌మ‌మ‌ని WWF లివింగ్ ప్లానెట్ నివేదిక పేర్కొంది. ప్ర‌పంచ దేశాలు ఈ విధానాల‌ను అనుస‌రిస్తే 2050 నాటికి ఆహార ఉత్ప‌త్తి కోసం త‌క్కువ స్థాయిలో భూమి వాతావ‌ర‌ణం దెబ్బతింటుందని పేర్కొంది. త‌ద్వారా ఒక‌టికంటే త‌క్కువ భూభాగంలోనే మాన‌వాళికి అవ‌స‌ర‌మైన ఆహారాన్ని ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ంది. అర్జెంటీనా, AUS, US, బ్రెజిల్ దేశాల ఆహార వినియోగ ప‌ద్ధతుల‌ను నివేదిక ఆక్షేపించింది.

News October 10, 2024

వారంలో రూ.7,500 కోట్ల డ్రగ్స్ సీజ్

image

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కార్యకలాపాలపై స్పెషల్ సెల్ ఉక్కుపాదం మోపుతోంది. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కేజీల కొకైన్‌ను సీజ్ చేసింది. ఇటీవల 560 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఇవాళ 200 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్ చేసింది.