News January 3, 2025
రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటోంది: కేటీఆర్
TG: రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్‌లో చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను తీసేస్తామని చెబుతూ రైతు బంధు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Similar News
News January 14, 2025
నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త చూసుకుంటున్నారు: పీవీ సింధు
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో ఉన్న వీడియో చూసినప్పుడు ఎమోషనల్ అయినట్లు పీవీ సింధు చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నారు. ‘నా ఆదాయం, పన్నుల వ్యవహారాన్ని పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త దత్తసాయి మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాలేదు. అందుకు నేను సంతోషిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News January 14, 2025
రేపు సాయంత్రం 6 గంటలకు..
సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. రేపు సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.
News January 13, 2025
శ్రీవారి పరకామణిలో చోరీ.. వెలుగులోకి సంచలన విషయాలు
AP: తిరుమల శ్రీవారి పరకామణిలో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ చోరీ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్య కొన్ని నెలలుగా ఇదే తరహాలో దొంగతనాలు చేసినట్లు వెల్లడైంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్‌లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.అర కోటి ఉంటుందని తెలిపారు.