News April 29, 2024
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ ఖాయం: అమిత్ షా

మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో నీచ రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు. SC, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన చెప్పినట్లుగా ఎడిట్ చేసిన ఓ వీడియోపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
Similar News
News April 15, 2026
ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.
News April 15, 2026
US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


