News September 8, 2024

2 నెలల జీతం విరాళం ప్రకటించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

image

TG: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని ఇస్తామని తెలిపింది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Similar News

News October 13, 2024

ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన 34 ప్రపంచ దేశాలు

image

లెబ‌నాన్‌లోని UN శాంతిప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల స్థావ‌రాలపై ఇజ్రాయెల్ దాడుల‌ను భార‌త్‌తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చ‌ర్య‌ల‌ను వెంట‌నే విర‌మించుకోవాల‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ఇటీవ‌ల ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ జ‌రిపిన‌ దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌లుగా UNIFIL ఆరోపించింది. బ‌ల‌గాల ర‌క్ష‌ణ అత్యంత ప్రాధాన్యాంశంగా భార‌త్ పేర్కొంది.

News October 13, 2024

సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత

image

AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.

News October 13, 2024

క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ నోటీసులు

image

TG: BRS నేత మన్నె క్రిశాంక్‌కు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.