News May 10, 2024
బీసీలకు రిజర్వేషన్లు పెంచుతుంటే కాంగ్రెస్ అడ్డుపడింది: మోదీ

TG: దేశం ఏమైపోయినా కాంగ్రెస్‌కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి కావాలని PM మోదీ విమర్శించారు. నారాయణపేట సభలో మాట్లాడుతూ.. ‘మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయి. BCలకు రిజర్వేషన్లు పెంచేటప్పుడు అడ్డుపడింది కాంగ్రెస్సే. SC, STల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని ఆ పార్టీ ప్రయత్నించింది. ముస్లింల కోసం ఎంతో కృషి చేస్తోన్న INC.. ఎస్సీల రిజర్వేషన్లను పట్టించుకోవట్లేదు’ అని మండిపడ్డారు.
Similar News
News February 14, 2025
2007 తర్వాత తొలిసారిగా లాభాల్లోకి BSNL

BSNL 2007 తర్వాత తొలిసారిగా లాభాల్ని చూసింది. ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో రూ.262 కోట్ల లాభం సంపాదించినట్లు ప్రకటించింది. ‘కొత్త ఆవిష్కరణలు, వినియోగదారుల సంతృప్తి, దూకుడుగా నెట్‌వర్క్ విస్తరణ వంటివి లాభాలకు దోహదం చేశాయి. ఖర్చులు తగ్గించుకోవడం కూడా లాభించింది. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లాభాలు 20శాతం దాటొచ్చని అంచనా వేస్తున్నాం’ అని సంస్థ సీఎండీ రాబర్ట్ జే రవి తెలిపారు.
News February 14, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

AP: BC విద్యార్థుల ₹110.52 కోట్ల డైట్ బకాయిలు, ₹29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ₹13.10 కోట్లతో 660 హాస్టళ్లలో చేపట్టిన మరమ్మతులు 6 వారాల్లో పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించాలని సూచించారు. నసనకోట, ఆత్మకూరు BC సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.
News February 14, 2025
ఆటవిక పాలనలోనే దాడులు, హత్యలు: సీఎం

AP: నేరస్థులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని CM చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని చంపి ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారని వైసీపీ నేతలను విమర్శించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించాలనేది వారి తాపత్రయమన్నారు. ఆటవిక పాలనలోనే దాడులు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని తెలిపారు. తాము ప్రజాస్వామ్యవాదులమని, చట్టబద్ధంగా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు.