News May 20, 2024

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది: KTR

image

TG: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన గురించి ఆరునెలల్లోనే ప్రజలకు అర్థమైందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, తమ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. గత 65 ఏళ్లలో రాష్ట్రానికి కేవలం 3 మెడికల్ కాలేజీలే వస్తే తాము పదేళ్లలో 33 ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు.

Similar News

News December 13, 2024

శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

AP: కర్నూలు(D) పత్తికొండ మార్కెట్‌లో రూ.1కి పడిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. లాభ నష్టాలు లేకుండా కిలో రూ.8కి మార్కెటింగ్ శాఖ కొనాలని ఆదేశించారు. APలోని మార్కెట్లలో కూడా అదే ధరకు విక్రయించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు నాసిరకం పంట అందుబాటులోకి రావడంతో సాధారణ టమాటాపై ప్రభావం పడిందని అధికారులు, రైతులు పేర్కొన్నారు.

News December 13, 2024

పుష్కరాల్లో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?: RGV

image

అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పోలీసులకు RGV 4 ప్రశ్నలు వేశారు. ‘పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నేతలను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్‌ను అరెస్ట్ చేస్తారా? భద్రత ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు?’ అని ప్రశ్నించారు.

News December 13, 2024

డ్రామాలతో కాంగ్రెస్ డైవర్షన్ పాలన: బండి సంజయ్

image

అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్ ఘటనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘ఇలా డ్రామాలు చేసి డైవర్షన్ పాలన సాగిస్తోందీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకప్పుడు తప్పుడు పాలన చేసి రాష్ట్రాన్ని దోచుకున్నవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే, జాతీయ అవార్డు గ్రహీత నటుడిని మాత్రం అరెస్ట్ చేశారు. సెన్సేషనలిజం వారి అసమర్థతను దాచలేదు. కాంగ్రెస్ నాటకాన్ని దేశం మొత్తం చూసింది’ అని ఫైరయ్యారు.