News December 30, 2024

మన్మోహన్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం: కిషన్ రెడ్డి

image

TG: వాజ్‌పేయి తరహాలోనే మన్మోహన్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధానిగా సేవలందించిన నెహ్రూ కుటుంబేతర వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తగిన విధంగా గౌరవించలేదని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

Similar News

News January 13, 2025

యువరాజ్ సింగ్ తండ్రిపై ఉమెన్స్ కమిషన్ సీరియస్

image

మహిళలను కించపరుస్తూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ఉమెన్స్ కమిషన్ ఆగ్రహించింది. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ ‘మహిళల చేతికి పవర్ ఇస్తే అంతా సర్వనాశనం చేస్తారు. గతంలో ఇందిరా గాంధీ దేశాన్ని పాలించి అదే చేశారు. ఏ మహిళకైనా ఇంటి బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతి. అందుకే వారికి పవర్ ఇవ్వొద్దు. ప్రేమ, గౌరవమే ఇవ్వాలి’ అని అన్నారు.

News January 13, 2025

నిజామాబాద్‌లో రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

image

TG: పండగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. ఆయన మూడేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. కాగా తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చింది.

News January 13, 2025

కోహ్లీ రెస్టారెంట్‌: ఉడ‌క‌బెట్టిన మొక్క‌జొన్న ధ‌ర ₹525

image

కోహ్లీ రెస్టారెంట్ చైన్ One8 Communeలో ధ‌ర‌లపై చ‌ర్చ నడుస్తోంది. ఉడ‌క‌బెట్టిన ప్లేటు మొక్క‌జొన్న కంకులకు ₹525 ధ‌ర చెల్లించానని HYDకు చెందిన ఓ యువ‌తి పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. దీంతో కొంద‌రు ఆమెకు మ‌ద్ద‌తిస్తుంటే, ఇంకొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు. బ్రాండ్ హోట‌ల్స్‌లో ఉండే ఏంబియ‌న్స్‌కు ఆ మాత్రం ధ‌ర ఉంటుంద‌ని ఒక‌రు, One8 క‌మ్యూనిటీ మొత్తానికీ చెల్లించార‌ని మ‌రొక‌రు కామెంట్ చేస్తున్నారు.